ప్రముఖ నిర్మాణ సంస్థలో మెగా డాటర్ నిహారిక సినిమా !


‘ఒక మనసు’ సినిమాతో హీరోయిన్ గా రంగప్రవేశం చేసి నటిగా గుర్తింపు తెచ్చుకున్న మెగా డాటర్ నిహారిక ప్రస్తుతం తన రెండవ తెలుగు సినిమాకి సిద్ధమైంది. ‘సాహో’ వంటి భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తున్న ప్రముఖ నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉందనున్న ఈ చిత్రానికి ‘హ్యాపీ వెడ్డింగ్’ ఆనే టైటిల్ ను ఖరారు చేశారు.

సుమంత్ అశ్విన్ ఈ సినిమాలో హీరోగా నటిస్తుండగా నూతన దర్శకుడు లక్ష్మణ్ కార్య దర్శకత్వ భాద్యతలు చూసుకోనున్నారు. ఇందులో మరో విశేషమేమిటంటే ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందివ్వనున్నారు. ఈ చిత్రం యొక్క రెగ్యులర్ షూట్ ను అక్టోబర్ 4 నుండి మొదలుపెట్టనున్నారు. ఇకపొతేనిహారిక ప్రస్తుతం ఒక తమిళ సినిమాలో కూడా నటిస్తోంది.