భగవంత్ కేసరి నుండి ఉయ్యాలో ఉయ్యాల సాంగ్ రిలీజ్!

Published on Oct 4, 2023 5:27 pm IST


నటసింహం, నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం లో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ భగవంత్ కేసరి. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 19, 2023 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా ఈ చిత్రం నుండి ఉయ్యాలో ఉయ్యాల సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేయడం జరిగింది. పాట చాలా ఆకట్టుకుంటుంది. అనంత్ శ్రీరామ్ పాటకి లిరిక్స్ రాయగా, ఎస్పీ చరణ్ పాడటం జరిగింది. ఈ చిత్రం లో కాజల్ అగర్వాల్, శ్రీ లీల, అర్జున్ రాంపాల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

పాట కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :