అక్టోబర్ 2న విడుదలకానున్న ‘సైరా’ చిత్రానికి ఉన్న ఏకైక వివాదం తొలగింది. గత కొన్నిరోజులుగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వంశీకులు చిత్ర నిర్మాత రామ్ చరణ్ తమకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడంలేదని, మోసం చేశారని పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరు కూడా ఒక ఇంటర్వ్యూలో స్పందిస్తూ వాళ్లు ఒక్కో కుటుంబానికి రూ.2 కోట్ల చొప్పున రూ.50 కోట్లు అడగడం భావ్యం కాదని, అమాయకులైన వారిని ఎవరో ఉసిగొల్పుతున్నారని అన్నారు.
కానీ ఉయ్యాలవాడ వంశీకులు మాత్రం తాము ఒక్కో కుటుంబానికి రూ.2 కోట్లు అడగలేదని, వంశీకులు ఒక్కొక్కరికి రూ.15 లక్షలు చొప్పున ఇవ్వమని అడిగామని అన్నారు. ఈ వివాదానికి సంబంధించి తాము వేసిన కేసులన్నీ వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ పరిణామంతో సినిమాకున్న అడ్డంకులన్నీ తొలగిపోయాయి. మరి దీనిపట్ల నిర్మాత చరణ్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
