స్టార్ డైరెక్టర్ సినిమా.. క్లారిటీ వచేసినట్లే !

వి.వి వినాయక్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా సి.కళ్యాణ్ ఓ సినిమాని నిర్మించటానికి ముమ్మరంగా ప్రయత్నం చేసినప్పటికీ ఆ సినిమా మొత్తానికి క్యాన్సిల్ అయిపోయింది. బాలయ్య బోయపాటి మరియు కె యస్ రవి కుమార్ సినిమాలతో బిజీ అయిపోయాడు. దాంతో వినాయక్ కు ఇప్పట్లో బాలయ్య డేట్లు దొరకవని క్లారిటీ వచ్చేసింది.

కాగా వినాయక్ తన కథను రవితేజకు వినిపించారని.. రవితేజకు కూడా కథ బాగా నచ్చిందని గతంలో వార్తలు వచ్చాయి. కాగా తాజా సమాచారం ప్రకారం వీరి సినిమా వచ్చే ఏడాది పట్టాలెక్కనుందని తెలుస్తోంది. ఇక గతంలో వీరి కాంబినేషన్ లో ‘కృష్ణ’ సూపర్ హిట్ చిత్రం వచ్చింది. ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ అయింది. మళ్లీ ఇంతకాలానికి ఈ కాంబినేషన్ లో సినిమా రాబోతుంది. మరి ఈ సినిమాతోనైనా వినాయక్ హిట్ ట్రాక్ ఎక్కుతాడేమో చిచూడాలి.

Exit mobile version