డిజిటల్ ప్రీమియర్ కి సిద్ధమైన కీర్తి సురేష్ “వాషి”

Published on Jul 3, 2022 3:40 pm IST


స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ చివరిసారిగా కోర్ట్ రూమ్ డ్రామా వాషిలో కనిపించింది. టోవినో థామస్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమా ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు ఈ చిత్రం జూలై 17 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో డిజిటల్ ప్రీమియర్‌ గా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతోంది.

OTT ప్లాట్‌ఫారమ్ కొద్దిసేపటి క్రితం అధికారిక ప్రకటన చేయడం జరిగింది. ఈ చిత్రం మలయాళం, తమిళం, తెలుగు మరియు కన్నడ భాషలలో ప్రసారం కానుంది. విష్ణు జి రాఘవ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కైలాస్ మీనన్ సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మక ప్రొడక్షన్ బ్యానర్ రేవతి కళామందిర్ నిర్మించడం జరిగింది.

సంబంధిత సమాచారం :