వరుడు కావలెను నుంచి నేడు “వడ్డానం” లిరికల్ సాంగ్..!

వరుడు కావలెను నుంచి నేడు “వడ్డానం” లిరికల్ సాంగ్..!

Published on Oct 2, 2021 3:02 AM IST


యంగ్ హీరో నాగ శౌర్య, రీతూ వర్మ జంటగా లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం “వరుడు కావలెను”. ఈ చిత్రంలో మురళీ శర్మ, నదియా, వెన్నెల కిషోర్, ప్రవీణ్, హర్ష వర్ధన్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 15న రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే విడుదలైన సినిమా టీజర్, పాటలు ఆకట్టుకున్నాయి.

అయితే ఈ సినిమా నుంచి నేడు ఉదయం 10:08 గంటలకు “వడ్డానం” లిరికల్ వీడియో రిలీజ్ కాబోతుంది. పీడీవీ ప్రసాద్ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. విశాల్ చంద్ర శేఖర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు