క్రిష్, వైష్ణవ్ తేజ్ ల సినిమాకి రిలీజ్ డేట్ ఫిక్స్!

Published on Aug 17, 2021 11:00 am IST

మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన అందరి హీరోస్ లో తన మొదటి సినిమాతోనే బిగ్గెస్ట్ హిట్ ని అందుకున్నాడు యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో పంజా వైష్ణవ్ తేజ్. “ఉప్పెన” తో సెన్సేషనల్ విజయాన్ని అందుకున్న వైష్ణవ్ దాని తర్వాత సినిమానే విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడితో చేసి సినీ వర్గాలను టాలీవుడ్ ఆడియెన్స్ ను మరింత ఆకర్షితులను చేసాడు. ఇంట్రెస్టింగ్ బ్యాక్ డ్రాప్ లోనే తెరకెక్కించిన ఈ చిత్రం ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది.

అయితే ఇప్పుడు ఈ చిత్రం ఇప్పుడు రిలీజ్ కి రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది. మరి లేటెస్ట్ సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని వచ్చే అక్టోబర్ 8న రిలీజ్ చెయ్యాలని ఫిక్స్ చేసినట్టుగా టాక్. ఇంకా టైటిల్ కూడా రివీల్ కానీ ఈ చిత్రం నుంచి ముందు రోజుల్లో సాలిడ్ ప్రమోషన్స్ సహా అన్ని మేకర్స్ షురూ చెయ్యనున్నారట. క్రిష్ ప్రొడక్షన్ హౌస్ ఫస్ట్ ఫ్రేమ్ ఎంటెర్టైన్మెంట్స్ లోనే నిర్మించబడ్డ ఈ చిత్రంపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :