టాలీవుడ్ యువ జంట ఆనంద్ దేవరకొండ అలాగే వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్స్ గా దర్శకుడు ఆదిత్య హాసన్ తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రమే ‘ఎపిక్’ ఫస్ట్ సెమిస్టర్. అయితే 90స్ మిడిల్ క్లాస్ బయోపిక్ నుంచి కొనసాగింపుగా తీసుకొచ్చిన ఈ సినిమా ఒకింత మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది.
కానీ ప్రీమియర్స్ సహా మొదటి రోజు వసూళ్లు మాత్రం ప్రపంచ వ్యాప్తంగా బాగానే వచ్చాయి. అయితే ఇక రెండు రోజుల్లో మొత్తం సుమారు 8 కోట్ల మేర గ్రాస్ ని అందుకున్నట్టు మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. సో ఇది మాత్రం మంచి నెంబర్ అనే చెప్పొచ్చు. అలాగే ఈ ఆదివారం వసూళ్లు కూడా బాగానే రావచ్చు.
సో ఎపిక్ కి మాత్రం మంచి నంబర్స్ వీకెండ్ కి డీసెంట్ వసూళ్లు అందుకుంటుంది. ఇక ఈ చిత్రంలో శివాజీ, వాసుకిలు మరో కీలక పాత్రల్లో నటించారు. అలాగే హేశం అబ్దుల్ వాహాబ్ సంగీతం అందించగా సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ నిర్మాణం వహించారు.
