సెన్సార్ కంప్లీట్ చేసుకున్న వైష్ణవ్ తేజ్ “కొండ పొలం”

Published on Oct 1, 2021 11:02 am IST


మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన యంగ్ అండ్ టాలెంటడ్ హీరో వైష్ణవ్ తేజ్.. తన మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని ఏ హీరో కూడా అందుకోని విధంగా సొంతం చేసుకున్నాడు. మరి ఈ చిత్రం అనంతరం విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తో ప్లాన్ చేసిన సినిమా “కొండ పొలం”. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని మేకర్స్ జస్ట్ సింగిల్ షెడ్యూల్ లో కంప్లీట్ చేసేసారు.

మరి ఈ దసరా కానుకగా రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ సినిమా నుంచి ఇటీవల ట్రైలర్ కూడా మంచి రెస్పాన్స్ రాగా ఇప్పుడు సెన్సార్ ని కంప్లీట్ చేసుకుంది. అయితే ఈ ట్రైలర్ ని చూస్తే క్రిష్ మార్క్ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది కానీ కథానుసారం యాక్షన్ మోతాదు కూడా బాగానే కనిపిస్తుంది.

ఫైనల్ గా మాత్రం సెన్సార్ యూనిట్ ఈ చిత్రానికి క్లీన్ యూ సర్టిఫికెట్ ఇచ్చింది. సో మొత్తం ఫ్యామిలీ అంతా ఈ క్లీన్ ఎంటర్టైనర్ ని చూడొచ్చని అర్ధం అయ్యింది. మరి ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందివ్వగా ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :