చరణ్ నెక్స్ట్ లో పాత్రకు ‘వకీల్ సాబ్’ నటి.!

Published on Aug 11, 2021 6:02 pm IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన భారీ పాన్ ఇండియన్ సినిమా “RRR” షూట్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అలాగే ఈ చిత్రం అనంతరం మరో పాన్ ఇండియన్ దర్శకుడు శంకర్ తో ఓ సినిమా చేయనున్నాడు. మరి ఎప్పటికప్పుడు ఆసక్తికర సమాచారం తో ట్రెండ్ అవుతున్న ఈ చిత్రంకి సంబంధించి మరో నయా టాక్ బయటకి వచ్చింది. ఈ చిత్రంలో ఒక కీలక పాత్రకి గాను శంకర్ ప్రముఖ నటి అంజలిని ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది.

ప్రస్తుతం టోటల్ కాస్ట్ ని ఫైనలైజ్ చేసే క్రమంలో ఓ కీ రోల్ కి గాను అంజలి పేరు కన్ఫర్మ్ అయ్యినట్టుగా సమాచారం.. మరి ఈ ఏడాదిలోనే అంజలి మరో కీలక పాత్ర పోషించిన “వకీల్ సాబ్” రిలీజ్ అయ్యిన సంగతి తెలిసిందే. అలా బాబాయ్ తో సినిమాలో నటించిన అంజలి ఇప్పుడు అబ్బాయ్ చరణ్ తో సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది. మరి ఈ చిత్రంలో ఎలాంటి రోల్ లో తాను కనిపించనుందో చూడాలి.

సంబంధిత సమాచారం :