ఇంట్లో కూర్చొని గర్వంగా చూడాల్సిన సినిమా వకీల్ సాబ్!

Published on Jul 18, 2021 3:02 pm IST

పవర్ ప్యాక్డ్ మూవీ వకీల్ సాబ్ చిత్రం నేడు జీ తెలుగు లో సాయంత్రం ఆరు గంటలకు ప్రసారం కానున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మేరకు శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ సోషల్ మీడియా ద్వారా ఒక పోస్ట్ చేయడం జరిగింది. ఇంట్లో కూర్చొని కుటుంబమంతా కలిసి గర్వంగా చూడాల్సిన సినిమా వకీల్ సాబ్ అంటూ చెప్పుకొచ్చింది. అయితే ఈ చిత్రం ఈ రోజు జీ తెలుగు లో సాయంత్రం ఆరు గంటల కు స్ట్రీమ్ కానుంది అంటూ చెప్పుకొచ్చింది.

బాలీవుడ్ పింక్ చిత్రానికి రీమేక్ అయిన ఈ చిత్రం తెలుగు నాట భారీ కలెక్షన్లు వసూలు చేసింది. ఈ చిత్రం నేడు బుల్లితెర పై ప్రసారం కానుండటం తో అభిమానులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ చిత్రం మొదటి సారి స్ట్రీమ్ కానుండటంతో కుటుంబ సభ్యులు కూడా చూసే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఈ చిత్రం లో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా, ఈ చిత్రం లో అనన్య నాగళ్ళ, అంజలి, నివేథా థామస్, ప్రకాష్ రాజ్ లు కీలక పాత్రల్లో నటించారు.

సంబంధిత సమాచారం :