బుల్లితెర పై మరొకసారి సందడి చేసేందుకు సిద్ధమైన వకీల్ సాబ్

Published on Sep 20, 2021 7:26 pm IST


పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ అయిన వకీల్ సాబ్ థియేటర్ల లో విడుదల అయి సూపర్ హిట్ అయింది. ఇదే తరహాలో అమెజాన్ ప్రైమ్ వీడియో లో సైతం భారీ వ్యూస్ ను కొల్లగొట్టింది. బుల్లితెర పై వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రసారం అయి సెన్సేషన్ క్రియేట్ చేసింది. మొదటి సారి ఈ సినిమా కి భారీ టీఆర్పీ వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. మొదటి సారి వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రసారం అయినప్పుడు 19.12 టీఆర్పీ ను నమోదు చేయడం జరిగింది.

అయితే ఇప్పుడు రెండవ సారి వకీల్ సాబ్ బుల్లితెర పై సందడి చేయడానికి సిద్దం అయ్యారు. సెప్టెంబర్ 26 వ తేదీన ఆదివారం సాయంత్రం 6 గంటలకు జీ తెలుగు లో వకీల్ సాబ్ ప్రసారం కానుంది. అయితే రెండవ సారి ఏ రేంజ్ లో టీఆర్పీ రేటింగ్ వస్తుంది అనే దాని పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం :