ఈ గట్టి పోటీలో ‘సాబ్’ లెక్క ఎక్కడ ఆగుతుందో.!

Published on Jul 18, 2021 12:56 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ అండ్ మోస్ట్ అవైటెడ్ చిత్రం “వకీల్ సాబ్”. దాదాపు మూడున్నరేళ్లు తర్వాత వచ్చినా ఈ సినిమాతో పవన్ భారీ ఓపెనింగ్స్ రాబట్టి తన స్టామినా చూపించాడు. దర్శకుడు వేణు శ్రీరామ్ తెరకెక్కించిన ఈ చిత్రం ఈరోజు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా మొట్ట మొదటి సారి టెలికాస్ట్ కి రెడీ అయ్యింది. అయితే ఇది వరకు పవన్ సాలిడ్ హిట్ చిత్రాలకి రికార్డు స్థాయి టీఆర్పీ వచ్చిన దాఖలాలు ఉన్నాయి.

“గబ్బర్ సింగ్”, “అత్తారింటికి దారేది” సినిమాలు మొదటి సారి టెలికాస్ట్ కి భారీ రేటింగ్ నే రాబట్టాయి. అయితే ఇదే రోజు పవన్ కి గట్టి పోటీనే ఉందని చెప్పాలి. ఈ సినిమా జీ తెలుగులో ప్రసారం కానుండగా సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ భారీ బ్లాక్ బస్టర్ చిత్రం “సరిలేరు నీకెవ్వరు” జెమినిలో ప్రసారం కానుంది. పైగా ఈ సినిమా కూడా స్మాల్ స్క్రీన్ పై టెలికాస్ట్ చేసిన ప్రతీసారి భారీ టీఆర్పీ లనే రాబట్టిన రికార్డులు ఉన్నాయి.

ఫ్యామిలీ ఆడియెన్స్ ని బాగా ఆకట్టుకున్న చిత్రాల్లో ఇది కూడా ఒకటి కావడంతో సాబ్ కి మొదటి సారే అయినా గట్టి పోటీ తప్పదని చెప్పాలి. మామూలుగానే మహేష్ పవన్ సినిమాలకు కంబైన్డ్ టాక్ వస్తే ఆ వైబ్రేషన్స్ అభిమానుల్లో వేరే లెవెల్లో ఉంటాయి. అంత మంచి బాండింగ్ వారికి ఉంది. మరి ఈసారి పోటీ ఎలా ఉంటుందో ముఖ్యంగా “వకీల్ సాబ్” ఫస్ట్ టైమే రేటింగ్ ఎంత రాబడుతుందో అన్నది ఆసక్తిగా మారింది.

సంబంధిత సమాచారం :