వన్ మిలియన్ లైక్స్ సొంతం చేసుకున్న వలిమై మోషన్ పోస్టర్!

Published on Jul 12, 2021 3:30 pm IST

జీ స్టూడియోస్ మరియు బోని కపూర్ సంయుక్తంగా కలిసి నిర్మిస్తున్న చిత్రం వలిమై. ఈ చిత్రం లో అజిత్ కుమార్ హీరోగా నటిస్తున్నారు. అయితే తాజాగా ఈ చిత్రం మోషన్ పోస్టర్ విడుదల అయిన సంగతి తెలిసిందే. అయితే 24 గంటలు కూడా కాకముందే ఈ పోస్టర్ వన్ మిలియన్ కి పైగా లైక్స్ ను సొంతం చేసుకుంది. అయితే అందుకు సంబంధించిన పోస్టర్ ను చిత్ర యూనిట్ సోషల్ మీడియా లో పోస్ట్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ పోస్టర్ కాస్త సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

తమిళ నాట అజిత్ కి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. పోస్టర్ విడుదల కావడం తో లైక్స్ తో షేర్ చేస్తూ వైరల్ చేశారు. ఈ చిత్రం లో అజిత్ సరసన హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తుంది. ఈ చిత్రం లో కార్తికేయ, హుమ కూరేశి, యామి గౌతమ్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం విడుదల కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం :