అజిత్ “వలిమై” ఖాతాలో మరో రికార్డ్..!

Published on Mar 27, 2022 3:01 am IST

తమిళ స్టార్‌ హీరో అజిత్ కుమార్ కథానాయకుడిగా, హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం “వలిమై”. జీ స్టూడియోస్ మరియు బోని కపూర్‌లు సంయుక్తంగా నిర్మించారు. మంచి అంచనాలతో ఫిబ్రవరి 24న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం హిట్‌టాక్‌ను తెచ్చుకుని కలెక్షన్లను కూడా బాగానే రాబట్టుకుంది. ఇక ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను అలరించిన ఈ చిత్రం ఈ నెల 25 నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక జీ5 ద్వారా స్ట్రీమింగ్‌కి వచ్చింది.

అయితే ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో కూడా రికార్డులను నమోదు చేస్తున్నట్టు తెలుస్తుంది. కేవలం 24 గంటల్లోనే ఈ చిత్రం 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్‌ని పూర్తి చేసుకుంది. జీ5లో ఇది బిగ్గెస్ట్ ఓపెనింగ్ అని తెలుస్తుంది. ఇక ఈ చిత్ర విషయానికి వస్తే ఇందులో అజిత్ కుమార్ ఐపీఎస్‌ ఆఫీసర్ అర్జున్‌ పాత్రలో నటించగా, హ్యుమా ఖురైషీ, కార్తికేయ ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్‌తో కలిసి బేవ్యూ ప్రాజెక్ట్ ఎల్‌ఎల్‌పికి చెందిన బోనీ కపూర్ నిర్మించారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :