జీ5 లో “వలిమై” ప్రభంజనం.. 7 రోజుల్లోనే 500 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్‌..!

జీ5 లో “వలిమై” ప్రభంజనం.. 7 రోజుల్లోనే 500 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్‌..!

Published on Apr 1, 2022 9:07 PM IST

తమిళ స్టార్‌ హీరో అజిత్ కుమార్ కథానాయకుడిగా, హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం “వలిమై”. జీ స్టూడియోస్‌తో కలిసి బేవ్యూ ప్రాజెక్ట్ ఎల్‌ఎల్‌పికి చెందిన బోనీ కపూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మంచి అంచనాలతో ఫిబ్రవరి 24న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం హిట్‌టాక్‌ను తెచ్చుకుని కలెక్షన్లను కూడా బాగానే రాబట్టుకుంది. ఇక మార్చి 25 నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక జీ5 ద్వారా డిజిటల్ స్ట్రీమింగ్‌కి వచ్చిన ఈ చిత్రం అక్కడ కూడా రికార్డులను కొల్లగొడుతుంది.

జీ5లోకి వచ్చిన 7 రోజుల్లోనే ఈ చిత్రం 500 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలతో దూసుకుపోతూ డిజిటల్ రంగంలో రికార్డ్ సృష్టిస్తుంది. ఈ సినిమాలో ఉన్న అద్భుతమైన సామాజిక అంశాలతో, థ్రిల్లింగ్ విజువల్స్ తో వీక్షకులను ఆకట్టుకుంటున్న “వలిమై” నిస్సందేహంగా డిజిటల్ రంగంలో’ పాన్-ఇండియా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అంతేకాదు ఈ చిత్రాన్ని మలయాళంలో కూడా విడుదల చేయమని ప్రజల నుండి జీ5 సంస్థకు ఊహించనటువంటి అభ్యర్థనలు అందుతున్నాయి. ప్రజల డిమాండ్‌ను గౌరవిస్తూ, స్ట్రీమింగ్ దిగ్గజం మలయాళ వెర్షన్‌ను కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఇదేకాకుండా వీక్షకుల కోరికమేరకు మొట్ట మొదటిసారిగా వలిమై సినిమా నుండి తొలగించబడిన సీన్స్ కూడా ఇప్పుడు ప్రసారం చేయబడుతున్నాయి.

ఇకపోతే జీ5 స్ట్రీమింగ్‌ను జరుపుకోవడానికి ముందు అజిత్‌ కుమార్‌ గౌరవార్ధం చెన్నైలోని వైయంసీఏ సర్కిల్‌లో 10,000 అడుగుల పొడవైన అతిపెద్ద పోస్టర్‌ను ఏర్పాటు చేసింది జీ5 సంస్థ. భారతదేశంలో ఏ ఓటీటీ సంస్థ ఇటువంటి అతి పెద్ద పోస్టర్ ను ఇప్పటి వరకు ఏర్పాటు చేయలేదు. భారతీయ స్ట్రీమింగ్ చరిత్రలో ఇది తిరుగులేని రికార్డు అని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు