అజిత్ “వలిమై” డిజిటల్ ప్రీమియర్ గా వచ్చేది అప్పుడే!

Published on Feb 25, 2022 6:26 pm IST

అజిత్ కుమార్ హీరోగా నటించిన తాజా చిత్రం వలిమై. ఈ చిత్రం విడుదల అయ్యి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. తమిళ నాట ఈ చిత్రం సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. హెచ్. వినోద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్నారు. బోని కపూర్ నిర్మించిన ఈ చిత్రం త్వరలో డిజిటల్ ప్రీమియర్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ చిత్రం ను వచ్చే నెల మార్చ్ 25 వ తేదీన డిజిటల్ ప్రీమియర్ గా జీ ప్రేక్షకుల ముందుకు తీసుకు రానుంది. మిగతా బాషల్లో కూడా ఈ చిత్రం అందుబాటులో ఉండే అవకాశం ఉంది. భారీ ధరకు ఈ చిత్రాన్ని జీ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. హుమ ఖురేషీ, కార్తికేయ లు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం ఏ తరహా వసూళ్ళను రాబడుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం :