ఇట్స్ అఫీషియల్: సంక్రాంతి బరిలోకి అజిత్ “వలిమై”…సెన్సార్ కార్యక్రమాలు పూర్తి!

ఇట్స్ అఫీషియల్: సంక్రాంతి బరిలోకి అజిత్ “వలిమై”…సెన్సార్ కార్యక్రమాలు పూర్తి!

Published on Dec 31, 2021 7:01 PM IST

అజిత్ కుమార్ హీరోగా హెచ్. వినోత్ దర్శకత్వం లో తెరకెక్కిన తాజా చిత్రం వలిమై. ఈ చిత్రం ను జీ స్టూడియోస్ మరియు బే వ్యూ ప్రాజెక్ట్స్ ఎల్ ఎల్ పి ల పై బోని కపూర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కి సంబంధించిన ప్రచార చిత్రాలు, వీడియో లు, పాటలు విడుదల అయ్యి ప్రేక్షకులను అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

తాజాగా ఈ చిత్రం కి సంబంధించిన ఒక అప్డేట్ ను చిత్ర యూనిట్ సోషల్ మీడియా వేదిక గా వెల్లడించడం జరిగింది. ఈ చిత్రం సంక్రాంతి బరిలో దిగేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. జనవరి 13 వ తేదీన ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ సరికొత్త పోస్టర్ తో ప్రకటించడం జరిగింది. అంతేకాక ఈ చిత్రానికి యూ/ఏ సెన్సార్ సర్టిఫికెట్ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం లో హుమ ఖురేషీ, కార్తికేయ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు