హీరో కార్తికేయ కి “వలిమై” టీమ్ బర్త్ డే విషెస్

Published on Sep 21, 2021 11:40 am IST


అజిత్ కుమార్ హీరోగా హెచ్. వినోత్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం వలిమై. ఈ చిత్రం లో టాలీవుడ్ యంగ్ హీరో గుమ్మకొండ కార్తికేయ ఒక కీలక పాత్ర లో నటిస్తున్నారు. అయితే నేడు కార్తికేయ పుట్టిన రోజు సందర్భంగా వలిమై టీమ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ, కార్తికేయ కి సంబంధించిన లుక్ పోస్టర్ ను విడుదల చేయడం జరిగింది. ఈ పోస్టర్ లో కార్తికేయ చాలా రఫ్ అండ్ పవర్ ఫుల్ గా కనిపిస్తున్నారు.

ఈ చిత్రం లో బాలీవుడ్ భామ హుమా ఖురేషి మరొక కీలక పాత్ర లో నటిస్తున్నారు. బోని కపూర్ మరియు జీ స్టూడియోస్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్ లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, ఫస్ట్ సింగిల్ సినిమా పై భారీ అంచనాలు పెంచేశాయి.

సంబంధిత సమాచారం :