సూపర్ స్టార్ మహేష్ చేతుల మీదగా “వలిమై” ట్రైలర్ విడుదల

Published on Feb 11, 2022 12:00 am IST

అజిత్ కుమార్ హీరోగా హెచ్. వినోత్ దర్శకత్వం లో తెరకెక్కిన తాజా చిత్రం వలిమై. ఈ చిత్రం ను జీ స్టూడియోస్ మరియు బోని కపూర్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, వీడియో లకు ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి విశేష స్పందన లభిస్తోంది. ఈ చిత్రం ను తమిళం లో మాత్రమే కాకుండా, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో కూడా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

ఈ మేరకు తెలుగు లో ప్రమోషన్స్ ను వేగవంతం చేయడం జరిగింది. ఈ చిత్రం ట్రైలర్ ను తాజాగా తెలుగు లో విడుదల చేయడం జరిగింది. సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ట్రైలర్ ను సోషల్ మీడియా వేదిక గా షేర్ చేశారు. ఈ ట్రైలర్ కి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. కార్తికేయ, హుమ ఖురేషీ, బాణీ, సుమిత్ర, అచ్యుత్ కుమార్, యోగి బాబు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం యువన్ శంకర్ రాజా అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 24 వ తేదీన భారీగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :