అజిత్ “వలిమై” ట్రైలర్ విడుదల!

Published on Dec 30, 2021 8:17 pm IST

అజిత్ కుమార్ హీరోగా హెచ్ వినొత్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం వలిమై. జీ స్టూడియోస్ మరియు బోని కపూర్ లు ఈ చిత్రాన్ని సంయుక్తం గా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం కి సంబంధించిన ప్రచార చిత్రాలు, వీడియో, పాటలు విడుదల అయ్యి ప్రేక్షకులను అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఈ చిత్రం కి సంబంధించిన ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది.

ఈ చిత్రం ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. అజిత్ మరియు కార్తికేయ ల పెర్ఫార్మెన్స్ ఈ చిత్రం లో హైలెట్ గా ఉండే అవకాశం ఉంది. హుమ ఖురేషి, బాణీ, సుమిత్ర, అచ్యుత్ కుమార్, యోగి బాబు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 13 వ తేదీన విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :