వరల్డ్ డిజిటల్ ప్రీమియర్ గా అజిత్ “వలిమై”

Published on Mar 20, 2022 9:00 pm IST

అజిత్ కుమార్ హీరోగా హెచ్ వినోద్ కుమార్ దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం వలిమై. ఈ చిత్రం థియేటర్ల లో విడుదల అయ్యి ఘన విజయం సాధించింది. జీ స్టూడియోస్ మరియు బే వ్యూ ప్రాజెక్ట్స్ పతాకం పై బోని కపూర్ ఈ చిత్రాన్ని నిర్మించగా, యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం అందించారు.

ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టడం జరిగింది. ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ కి సిద్ధం అవుతోంది. మార్చ్ 25 నుండి ఈ చిత్రం జీ 5 లో తెలుగు, తమిళం, కన్నడ మరియు హిందీ భాషలలో ప్రసారం కానుంది. డిజిటల్ ప్రీమియర్ గా ఈ చిత్రం ఎలాంటి రెస్పాన్స్ ను దక్కించుకుంటుందో చూడాలి. ఈ చిత్రం లో హుమా ఖురేషీ మరియు హీరో కార్తికేయ కీలక పాత్రల్లో నటించారు.

సంబంధిత సమాచారం :