వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా యాక్షన్ ఎంటర్టైనర్ “వలిమై”

వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా యాక్షన్ ఎంటర్టైనర్ “వలిమై”

Published on Apr 10, 2022 7:03 PM IST

అజిత్ కుమార్ హీరోగా హెచ్ వినోద్ దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం వలిమై. జీ స్టూడియోస్ మరియు బే వ్యూ ప్రాజెక్ట్స్ ఎల్ ఎల్ పి పతాకం పై ఈ చిత్రాన్ని సంయుక్తం గా నిర్మించారు. యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం అందించడం జరిగింది. థియేటర్ల లో విడుదల అయిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటింది. ఇప్పుడు ఈ చిత్రం బుల్లితెర పై ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతోంది.

ఈ చిత్రం త్వరలో జీ తెలుగు లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం లో హుమ ఖురేషీ, కార్తికేయ గుమ్మకొండ లు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం బుల్లితెర పై ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు