త్వరలో మెగా హీరో టీజర్,హిట్ ఇస్తున్న డైరెక్టర్.

Published on Jul 12, 2019 10:00 pm IST

మెగా హీరో వరుణ్ తేజ్,హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “వాల్మీకి”. కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని 14రీల్స్ బ్యానర్ పై రామ్ ఆచంట,గోపి ఆచంట నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ మూవీ ప్రీ టీజర్ లో వరుణ్ లుక్ చూసిన అభిమానులు అవాక్కయ్యారు. మేడలో మాలలు,నల్లని డ్రెస్,జులపాలలో చేతిలో గన్ పట్టుకొని ఉన్న వరుణ్ ఓ కొత్త అవతారంలో కనిపించారు.

ఐతే ఈ మూవీ టీజర్ ని త్వరలోనే విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది. ఈ విషయాన్నీ హరీష్ శంకర్ ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. నిరవధికంగా షూటింగ్ జరుగుతుంది,టీజర్ ని మీకు టీజర్ చూపించే వరకు ఆగలేకున్నాను అంటూ ట్వీట్ చేశారు. వరుణ్ సరసన పూజా హెగ్డే నటిస్తుండగా,మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More