స్క్రిప్ట్ పట్ల మహేష్ చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నారన్న వంశీ పైడిపల్లి !

26th, June 2017 - 04:35:29 PM


ప్రస్తుతం ‘స్పైడర్’ షూటింగ్ ముగింపు పనుల్లో ఉన్న సూపర్ స్టార్ మహేష్ కొరటాల శివటి ‘భరత్ అనే నేను’ సినిమా చిత్రీకరణను సైతం మొదలుపెట్టేశారు. ఈ సినిమా షూటింగ్ ఒక కొలిక్కి వచ్చిన తర్వాత మహేష్ వచ్చే ఏడాది ఆరంభంలో తన 25వ సినిమాను వంశీ పైడిపల్లితో ప్రాజెక్టును స్టార్ట్ చేస్తారు. స్క్రిప్ట్ పరంగా ఈ సినిమా చాలా కొత్తగా ఉంటుందట.

దీని గురించే వంశీ పైడిపల్లి మాట్లాడుతూ ‘మహేష్ మొదటిసారి స్క్రిప్ట్ నరేషన్ విన్నప్పుడు చాలా ఎగ్జైటెడ్ గా ఫీలయ్యారు. సినిమా మొదలుపెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. ఒక నటుడిగా ఆయన సినిమా కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నారు. దర్శకుడిగా అది నాకు చాలా ఉత్సాహాన్నిస్తుంది’ అన్నారు. మరి సినిమా ఎలా ఉండబోతోంది అనే ప్రశ్నకు మాత్రం వేచి చూడాలి అనే సమాధానంతోనే సరిపెట్టారు. ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్ గా పూజ హెగ్డే పేరు ప్రచారంలో ఉండగా ఇంకా పూర్తి స్థాయి కన్ఫర్మేషన్ రాలేదు.