‘థలపతి 66’ కోసం ఈ హీరోయిన్స్ ని లాక్ చేసిన వంశీ.?

Published on Feb 10, 2022 10:02 am IST

కోలీవుడ్ స్టార్ హీరో ఇళయ థలపతి విజయ్ జోసెఫ్ హీరోగా నటించిన లేటెస్ట్ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం “బీస్ట్” రిలీజ్ కి రెడీగా ఉంది. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా షూట్ అంతటినీ మేకర్స్ కంప్లీట్ చేసేసారు.

మరి తన కెరీర్ లో తెలుగులో కూడా మార్కెట్ ని పెంచుకుంటూ వస్తున్న విజయ్ ఇప్పుడు స్టార్ దర్శకుడు వంశీ పైడిపల్లి తో ఒక భారీ సినిమాని చేయనున్న సంగతి తెలిసిందే. దీనితోనే డైరెక్ట్ టాలీవుడ్ లోకి తాను అడుగు పెట్టనున్నాడు. మరి ఇపుడు ఈ సినిమాకే హీరోయిన్స్ గా ఒక ఇద్దరి స్టార్ హీరోయిన్స్ పేర్లని దర్శకుడు లాక్ చేసినట్టుగా బజ్ వినిపిస్తుంది.

మరి వారు ఎవరో కాదట ప్రస్తుతం టాలీవుడ్ లక్కీ హీరోయిన్స్ రష్మికా మందన్నా మరియు పూజా హెగ్డేలు అట. అయితే ఆల్రెడీ పూజా విజయ్ తో బీస్ట్ లో కూడా నటించింది. మరి ఈ ఇద్దరు పేర్లు విజయ్ 66వ సినిమాకి ఎంతమేర ఓకే అయ్యాయి అనేది వేచి చూడాలి.

సంబంధిత సమాచారం :