ఇది పూర్తిగా మహర్షి టీమ్ కి చెందింది – వంశీ పైడిపల్లి

Published on Oct 26, 2021 12:30 pm IST

జాతీయ అవార్డ్ అందుకున్న మహర్షి టీమ్ పై టాలీవుడ్ ప్రముఖులు, ప్రేక్షకులు, అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు అవార్డ్ అందుకోవడం పట్ల మహర్షి చిత్రం డైరెక్టర్ వంశీ పైడిపల్లి సోషల్ మీడియా ద్వారా పలు కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది.

వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య నాయుడు గారు చేతుల మీదుగా జాతీయ అవార్డు అందుకోవడం గౌరవం గా, వినయం గా ఉందని పేర్కొన్నారు. ఇది పూర్తిగా మహర్షి టీమ్ కి చెందింది అంటూ చెప్పుకొచ్చారు. మహేష్ సార్, ఇది సినిమా పై మీకున్న నమ్మకం కోసం అంటూ చెప్పుకొచ్చారు. ఉత్తమ జనాదరణ పొందిన చిత్రం గా మహర్షి అవార్డ్ అందుకోవడం పట్ల మహేష్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రం లో పూజ హెగ్డే హీరోయిన్ గా నటించగా, అల్లరి నరేష్ కీలక పాత్రలో నటించారు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పై ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది.

సంబంధిత సమాచారం :