వంశీ పైడిపల్లి – విజయ్ సినిమా పై లేటెస్ట్ అప్డేట్?

Published on Sep 20, 2021 2:00 am IST

టాలీవుడ్ లో పలు సినిమాలకి దర్శకత్వం వహించి టాప్ డైరెక్టర్ గా మారిన వంశీ పైడిపల్లి, తమిళనాట కూడా తన సత్తా చాటేందుకు సిద్దం అవుతున్నారు. మహర్షి సినిమా తో సౌత్ నాట విశేష ఆదరణ దక్కించుకున్న వంశీ పైడిపల్లి ఇప్పుడు తలపథి విజయ్ తో ఒక సినిమా చేసేందుకు సిద్ధమైన సంగతి అందరికీ తెలిసిందే. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో రానుంది. అంతేకాక ఈ సినిమా కి సంబందించిన టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పై అతి త్వరలో మేకర్స్ అధికారిక ప్రకటన చేయడం ఖాయం అని తెలుస్తుంది. అయితే టైటిల్ అనౌన్స్ మెంట్ త్వరలో ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం విజయ్ బీస్ట్ మూవీ సినిమా పని లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :