కృష్ణా జిల్లాలో ‘వంగవీటి’ ఎలా ఆడుతోంది?

vangaveeti
రామ్ గోపాల్ వర్మ అంటే ఇండియన్ సినిమాలో క్రైమ్ డ్రామా జానర్‌కు బ్రాండ్ డైరెక్టర్. ఈ జానర్‌లో ఆయన చూపిన కొత్తదనాన్ని వేరొక దర్శకులెవ్వరూ చూపలేదన్న పేరుంది. తాజాగా ఆయన వంగవీటి రంగ జీవిత కథ ఆధారంగా ‘వంగవీటి’ అనే క్రైమ్ సినిమాతో వచ్చిన విషయం తెలిసిందే. గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు మొదట్నుంచీ విపరీతమైన క్రేజ్ ఉండడంతో మొదటిరోజు అంతటా మంచి ఓపెనింగ్స్ వచ్చాయి.

ముఖ్యంగా విజయవాడ నేపథ్యంలో, అక్కడి రాజకీయ సంబంధమైన, రౌడీయిజంతో లింక్ ఉన్న సినిమా కావడంతో కృష్ణా జిల్లాలో ఈ సినిమాకు సూపర్ క్రేజ్ కనిపించింది. ఈ క్రమంలోనే మొదటిరోజు ఈ ప్రాంతంలో 20లక్షల రూపాయల మేర వసూళ్ళు రాబట్టిన సినిమా, రెండో రోజు కూడా 10 లక్షల మేర వసూలు చేసింది. ఇక ముందు ముందు కలెక్షన్స్ ఎలా ఉంటాయన్నది చూడాలి. దాసరి కిరణ్ కుమార్ నిర్మించిన ఈ సినిమాలో రంగా పాత్రలో కొత్త నటుడు సాండీ నటించారు.