నాలుగో పెళ్లి పై ‘వనితా విజయ్‌కుమార్‌’ క్లారిటీ !

Published on Jul 25, 2021 8:44 pm IST

కోలీవుడ్‌ పవర్‌స్టార్‌ శ్రీనివాసన్‌ ను ‘వనితా విజయ్‌కుమార్‌’ నాలుగో పెళ్ళి చేసుకున్నట్లుగా ఒక ఫొటో సోషల్‌ మీడియాలో బాగా హల్ చల్ చేసింది, అయితే, ఆమె నిజంగానే పెళ్లి చేసుకుందని నెటిజన్లు ఆమె పై విరుచుకు పడ్డారు. ఈ సందర్భంగా వనితా తాజాగా ఇచ్చిన మీడియా సమావేశంలో వివరణ ఇస్తూ.. ‘సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఫొటోలు మా పెళ్లి ఫొటోలు కాదు, పవర్‌స్టార్‌ దర్శకత్వంలో నేను నటిస్తున్న ‘పికప్‌ డ్రాప్‌’ అనే సినిమాకి సంబంధించిన ఫోటోలు అవి అంటూ చెప్పుకొచ్చింది వనితా.

పనిలో వనితా నెటిజన్లపై మండిపడింది. ‘ఇద్దరు నటీనటులు కలిసి ఫొటోలు తీసుకుని, వాటిని విడుదల చేస్తే పెళ్ళి జరిగినట్టా? ఇలాంటి విషయాలను చర్చనీయాంశం చేయాల్సిన అవసరం లేదు. నేను నాలుగు కాదు… 40 పెళ్ళిళ్ళు కూడా చేసుకుంటాను. అది నా హక్కు. మహిళల గురించి ఈ సమాజం ఇంకా చెడుగా మాట్లాడుతుండటం వల్లే ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. అయితే, నాకు ఇప్పట్లో వివాహం చేసుకునే ఉద్దేశం లేదు’ అని వనితా విజయకుమార్‌ చెప్పుకొచ్చింది.

సంబంధిత సమాచారం :