బాలయ్యకి కూడా విలన్ గా నటించబోతుందట!

బాలయ్యకి కూడా విలన్ గా నటించబోతుందట!

Published on Jul 3, 2022 4:10 PM IST

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రస్తుతం బాలయ్య బాబుతో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమాలో ఓ కీలక పాత్ర ఉంది. ఒక విధంగా సినిమాలో ఇది లేడీ విలన్ పాత్ర. కాగా ఈ పాత్రలో వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ నటించబోతుంది. మొత్తానికి వరలక్ష్మీ శరత్‌కుమార్‌ బాలయ్యకి కూడా విలన్ గా నటించబోతుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ శ్రీలీల కూడా బాలయ్యకి కూతురిగా ఈ సినిమాలో నటిస్తోంది.

ఇక ఆగస్టు ఫస్ట్ వీక్ నుంచి ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు. ఈ సినిమాలో మరో హీరో కూడా నటిస్తాడని.. అది రవితేజనే అని గతంలో వార్తలు వచ్చాయి. రవితేజ పాత్ర ఇంటర్వెల్ లో వస్తోందట. ఫస్ట్ హాఫ్ అంతా చాలా సీరియస్ గా సాగుతూ.. ఇంటర్వెల్ కి సినిమా ఫుల్ కామెడీగా టర్న్ అవుతుందని తెలుస్తోంది. ఏది ఏమైనా తనదైన మార్క్ టైమింగ్ తో, తన మార్క్ డైలాగ్ లతో వరుస విజయాలను అందుకుంటున్నాడు అనిల్ రావిపూడి. అందుకే, అనిల్ – బాలయ్య కలయికలో సినిమా అనగానే ఈ సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు