వరలక్ష్మి శరత్‌కుమార్‌ “శబరి” షూటింగ్‌ పూర్తి!

వరలక్ష్మి శరత్‌కుమార్‌ “శబరి” షూటింగ్‌ పూర్తి!

Published on Dec 9, 2022 1:31 AM IST


తన కిట్టిలో క్రేజీ సినిమాలు ఉన్న వరలక్ష్మి శరత్‌కుమార్ ప్రస్తుతం తన తదుపరి సైకలాజికల్ థ్రిల్లర్ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. శబరి అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రానికి నూతన దర్శకుడు అనిల్ కట్జ్ దర్శకత్వం వహిస్తున్నారు.

లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, ఈ సినిమా ఈరోజు షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకుంది. దీంతో ఈ సినిమా ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ మోడ్ లోకి వెళ్లింది. నిర్మాతలు త్వరలోనే విడుదల తేదీని వెల్లడిస్తారు. ఈనాడు, డమరుకం వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న గణేష్ వెంకట్రామన్ శబరిలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీత దర్శకుడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు