సందర్భం ఏదైనా, వ్యక్తులు ఎంతటివారైనా తనకు అనిపించడం అనేయడం తోచింది చేయడం వర్మ స్టైల్. ఒకప్పటి ఈ మేటి దర్శకుడు ఇప్పుడు వివాదాల వర్మగా మారిపోయాడు. తాజాగా ఆయన కమ్మరాజ్యంలో కడపరెడ్లు పేరుతో కుల రాజకీయాలపై ఓ కాంట్రవర్శీ మూవీ చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్ర ప్రోమోలు విడుదల చేసి కావలసినంత వివాదం, ప్రచారం పోజేసుకున్నాడు.
ఐతే ఈ రోజు ఆయన చేసిన పని వర్మ క్రేజీ నెస్ పరాకాష్టకు చేరిందా అనిపించింది. నేడు గాంధీజీ జయంతి సందర్భంగా ఆయన ట్విట్టర్ పోస్ట్ ఒకింత ఆశ్చర్యంగా అలాగే దేశభక్తులను ఉడికించేదిలా ఉంది. గాంధీ ఫొటోలో తన ఫోటో మార్ఫింగ్ చేసి…,నాలో గాంధీ ఉన్నాడన్న విషయం నాకే తెలియదు…,హ్యాపీ జయతి టు మీ…!” అని విచిత్రంగా తనకు తానే జయంతి శుభాకాంక్షలు చెప్పుకున్నాడు.
హింసా, శృంగారం దట్టించి సినిమాలు చేసే వర్మ తనలో గాంధీజీని వెత్తుక్కోవడం విడ్డురంగా ఉంది. వర్మ తాజా చర్యకు అహింసావాదులు, గాంధేయవాదులు ఎలా స్పందిస్తారో చూడాలి.
WHAATTT??? Never knew I had him in me ???????????? Happy My Jayanthi???????????? pic.twitter.com/VdnYT90Gfs
— Ram Gopal Varma (@RGVzoomin) October 2, 2019
