‘వారణాసి’ ఎక్స్ క్లూజివ్ ఫుటేజ్.. ఎప్పుడు ఎక్కడంటే!

Varanasi

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ప్రియాంక చోప్రా జోనస్ అలాగే పృథ్వీరాజ్ సుకుమారన్ ల కలయికలో గ్లోబల్ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న అవైటెడ్ సినిమానే “వారణాసి”. పాన్ వరల్డ్ లెవెల్లో ఒక ఇండియన్ సినిమా కోసం ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అంటే అది ఇది అనే చెప్పొచ్చు.

ఇక ఈ సినిమాపై ఇటీవల ఫేమస్ ఇంటర్నేషనల్ ఫిలిం ఈవెంట్ సినిమా కాన్ లో కనిపించకపోవడంతో పలు కామెంట్స్ వినిపించాయి. కానీ దానికి బదులుగా మరో ప్లాన్ తో ఇపుడు మేకర్స్ వస్తున్నారు. మెక్సికోలో జరగనున్న మరో పాపులర్ ఈవెంట్ కామిక్ కాన్ ఎక్స్ పీరియన్స్ ఈవెంట్ లో ఈ ఏప్రిల్ 24న హాజరు కానున్నారు.

అంతే కాకుండా అక్కడే నిర్మాత ఎస్ ఎస్ కార్తికేయ ఒక ఎక్స్ క్లూజివ్ ఫుటేజ్ ని కూడా స్క్రీనింగ్ చేయనున్నారట. సో అక్కడ నుంచి మరోసారి వారణాసి పేరు వరల్డ్ వైడ్ మార్కెట్ లో గట్టిగా వినిపిస్తుంది అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాకి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అలాగే కే ఎల్ సత్యన్నారాయణ కూడా నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

Exit mobile version