సస్పెన్స్ గా ‘వారణాసి’ ట్రీట్.. ఉత్కంఠతో మహేష్ ఫ్యాన్స్!

Varanasi

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఇప్పుడు నటిస్తున్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ ‘వారణాసి’ కోసం అందరికీ తెలిసిందే. భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రాన్ని దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తుండగా ఈ సినిమాని మేకర్స్ గ్రాండ్ లెవెల్లో ప్రపంచ ఆడియెన్స్ కి ప్రెజెంట్ చేస్తూ వస్తున్నారు.

అయితే మహేష్ బాబు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆ బిగ్ డే ఇప్పుడు రానే వస్తుంది. రేపు ఆగష్టు 9న మహేష్ బాబు పుట్టినరోజు కానుకగా వారణాసి ట్రీట్ కోసం అంతా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు కానీ సమయం దగ్గరకి వస్తున్నప్పటికీ చిత్ర యూనిట్ మాత్రం ఇంకా సస్పెన్స్ నే మైంటైన్ చేస్తున్నారు.

దీనితో అసలు వారణాసి టీం నుంచి ఏదన్నా సర్ప్రైజ్ ఉందా లేదా అనేది ఫ్యాన్స్ లో మరింత ఉత్సుకతను రేకెత్తిస్తుంది. రీసెంట్ గానే సినిమా నుంచి ఓ వీడియో లీక్ అయ్యి సోషల్ మీడియాలో వైరల్ అయ్యిపోయింది. ఈ క్రమంలో కొత్త కంటెంట్ ని విడుదల చేస్తారా లేదా అనేది అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

Exit mobile version