“వారిసు” హిందీ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది.!

Published on Feb 22, 2023 1:00 pm IST

ఇళయ దళపతి విజయ్ హీరోగా దర్శకుడు వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో తెరకెక్కించిన లేటెస్ట్ సాలిడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం “వారిసు”. తెలుగులో వారసుడు గా వచ్చిన ఈ సినిమా తెలుగులో కూడా మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఈరోజు ఈ చిత్రం మొత్తం నాలుగు ముఖ్య సౌత్ భాషల్లో అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే.

అయితే ఈ సినిమా థియేట్రికల్ గా హిందీలో కూడా రిలీజ్ అయ్యింది. మరి ఈరోజు సౌత్ భాషల్లో సినిమా స్ట్రీమింగ్ కి రాగా ఇప్పుడు అయితే ఈ సినిమా హిందీ స్ట్రీమింగ్ పై అయితే అప్డేట్ వచ్చింది. మరి ఈ సినిమా హిందీ స్ట్రీమింగ్ కూడా అమేజాన్ ప్రైమ్ వీడియో లోనే జరగనుండగా దీనిపై వీరు డేట్ ని అనౌన్స్ చేశారు. హిందీలో ఈ సినిమా ఈ మార్చ్ 8 నుంచి అయితే స్ట్రీమింగ్ కి రానున్నట్టుగా తెలిపారు. దీనితో ఈ సినిమా హిందీ స్ట్రీమింగ్ కోసం ఎదురు చూస్తున్నవారికి ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :