ఫేమస్ ఛార్ట్స్ లో “వారిసు” సాంగ్ హవా.!

ఫేమస్ ఛార్ట్స్ లో “వారిసు” సాంగ్ హవా.!

Published on Dec 29, 2022 8:59 AM IST

ఇళయ దళపతి విజయ్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా మన టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న అవైటెడ్ చిత్రం “వారిసు” కోసం అందరికీ తెలిసిందే. తెలుగు సహా తమిళ్ లో కూడా భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రం సంక్రాంతి బరిలో రిలీజ్ కాబోతుండగా ఈ సినిమా నుంచి వచ్చిన సాంగ్స్ అనూహ్యమైన స్పందనను అందుకుంటున్నాయి.

తమిళ్ లో అయితే రీసెంట్ గా సినిమా సౌల్ సాంగ్ ని ప్రముఖ గాయని కె ఎస్ చిత్ర గారు ఆలపించిన ఈ సాంగ్ ఇప్పుడు ఫేమస్ ట్విట్టర్ ఛార్ట్స్ బిల్ బోర్డు లో ఎన్నో ఇంటర్నేషనల్ సాంగ్స్ ని దాటి నెంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవుతుంది. ఇది మాత్రం మాములు విషయం కాదని చెప్పాలి. దీనితో ఈ చిత్ర యూనిట్ ఈ స్పందనతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ చిత్రానికి అయితే సంగీత దర్శకుడు థమన్ అద్భుతమైన ఆల్బమ్ ని అందించగా ఈ చిత్రం జనవరి 12న తమిళ్ తెలుగు సహా హిందీలో కూడా రిలీజ్ కాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు