వర్మ ఫస్ట్ లుక్ విడుదల తేదీ ఖరారు !

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ నటించిన చిత్రం ‘అర్జున్ రెడ్డి’ తమిళ భాషలో ‘వర్మ’ అనే టైటిల్ తో రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ చిత్ర షూటింగ్ కూడా పూర్తయింది. ఈ చిత్రంతో చియాన్ విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ హీరోగా పరిచయమవుతున్నాడు. విలక్షణ దర్శకుడు బాలా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ధృవ్ విక్రమ్ కు జోడిగా బెంగాలీ భామ మేఘ చౌదరి నటిస్తుంది.

ఇక ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ ను ఈ శనివారం తమిళనాడులోని వెల్లూర్ విట్ కళాశాలలో విడుదలచేయనున్నారు. ఈ4 ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రధాన్ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఈచిత్ర విడుదల తేదీని ప్రకటించనున్నారు.

Exit mobile version