షార్ట్ ఫిల్మ్ తీసినంత తేలికగా ఓ మూవీ తీసేసి విడుదల చేయడం వర్మ స్టైల్. ఏడాదికి రెండు నుండి మూడు సినిమాలు ఆయన ప్రమేయంతో విడుదల అవుతాయి. ఈ ఏడాది ఇప్పటికే లక్ష్మీస్ ఎన్టీఆర్, అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు అనే రెండు సినిమాలు విడుదల అయ్యాయి. ఎంటర్ ది గర్ల్ డ్రాగన్ అనే ఓ చిత్రాన్ని చైనా భాషలో విడుదల చేశారు. ఇక రామ్ గోపాల్ వర్మ పర్యవేక్షణలో అగస్త్య మంజు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం బ్యూటిఫుల్. నైనా గంగూలీ, పార్థ్ సూరి జంటగా తెరకెక్కిన ఈ రొమాంటిక్ థ్రిల్లర్ జనవరి 1న నూతన సంవత్సర కానుకగా విడుదల కానుంది.
ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా నేడు చిత్ర యూనిట్ వర్మ, నైనా గంగూలీ, పార్థ్, అగస్త్య సోషల్ మీడియాలో సాయంత్రం 8:45 నిమిషాలకు అభిమానులతో చాట్ చేస్తారట. విశేషం ఏమిటంటే వర్మ పేస్ బుక్ మరియు ఇంస్టాగ్రామ్ అకౌంట్స్ వేదికగా జరిగే ఈ చాట్ లో వర్మ అందరికీ వోడ్కా పార్టీ ఇస్తున్నాడట. ఈ పార్టీకి అందరూ ఆహ్వానితులే కాకపోతే ఎవరి వోడ్కా వారే కొనుక్కొని వారితో తమ మొబైల్ నుండి చాట్ చేయాలి . ఛాదస్తం కాకపోతే ఆయన వోడ్కా వేసుకొని లైవ్ చాట్ చేస్తే ప్రశ్నలు అడిగే వారు కూడా వోడ్కా వేయాలా..?
VODKA WITH RGV LIVE ..The BEAUTIFUL team is having a Pre-New Year PRIVATE PARTY, but all PUBLIC are invited to have a drink and chat with me , @NainaGTweets , @parthsuri2050 and #AgastyaManju via live streaming on my FB and Insta tonight 8.45 pm onwards ???????????? pic.twitter.com/0nW4VdU3ZN
— Ram Gopal Varma (@RGVzoomin) December 29, 2019
