దర్శకుడు వర్మ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం కమ్మ రాజ్యంలో కడప రెడ్లు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితుల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం కొన్ని వర్గాలకు చెందిన నాయకుల ఆగ్రహం తెప్పించేదిలా ఉంది.ప్రస్తుతం యాక్టీవ్ గా ఉన్న కొద్దిమంది రాజకీయనాయకులను పోలినట్లు ఉన్న పాత్రలతో విడుల చేసిన ఓ పోస్టర్ హాట్ టాపిక్ గా మారింది. వర్మ ఈ చిత్రంలో ఎవరిని ఎలా చూపించాలనుకుంటున్నాడో అర్థమైంది. కాగా కొద్దిసేపటి క్రితం ట్విట్టర్ లో వర్మ మరో ఫోటో విడుదల చేశారు.
ప్రచార వేదికపై హీటెక్కించే బట్టలలో ఉన్న విదేశీ ఆడవాళ్ళ మధ్యలో ప్రసంగిస్తున్నట్లున్న నాయకుడి ఫోటోను షేర్ చేశాడు. కమ్మరాజ్యంలో కడప రెడ్లు మూవీ ట్రైలర్ ఈనెల 27న విడుదల అవుతుంది అని, అలాగే ఈ చిత్రంలోని పాత్రలు ఎవరినైనా పోలివున్నట్లు కనిపిస్తే అది కేవలం అనుకోకుండా జరిగినదే అని వివరణ కూడా ఇచ్చారు. కొంచెం లోతు అర్థం తో కూడిన ఆ ఫోటో కొందరిని ఆగ్రహానికి గురిచేయడం ఖాయం. ఇలాంటివి ఎన్నో చేసిన వర్మ, సమస్యలను, విమర్శలను పట్టించుకోవడం ఎప్పుడో మానేశాడన్నసంగతి తెలిసిందే.
A pic from KAMMA RAJYAMLO KADAPA REDDLU ..Trailer releasing dayafter 27 th with Diwali blessings at 9.36 Am .. Resemblence to any person is purely coincidental #KRKR pic.twitter.com/hGFVMkre2F
— Ram Gopal Varma (@RGVzoomin) October 25, 2019
