‘పుష్ప’లో మరో టాలెంటెడ్ బ్యూటీ ?

Published on Sep 13, 2021 9:24 am IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో రాబోతున్న ‘పుష్ప’ను రెండు భాగాలుగా చేయాలని నిర్ణయించుకున్న తరువాత.. కథలో కొన్ని మార్పులతో పాటు కొత్త పాత్రలు కూడా యాడ్ అవుతున్నాయి. తాజాగా ఈ సినిమాలో ఓ కీలక పాత్ర ఉందట. ఆ పాత్రలో టాలెంటెడ్ బ్యూటీ వర్ష బొల్లమ్మ నటించబోతుందని తెలుస్తోంది. ఆమెది బన్నీకి చెల్లిలి పాత్ర టాక్ నడుస్తోంది. అయితే ఈ వార్త పై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.

ఇక ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్ లో బాలీవుడ్‌ బ్యూటీ ఊర్వశి రౌటెలా నటిస్తోంది. అలాగే వరుస విజయాలతో దూసుకుపోతున్న రష్మిక మందన్న ఈ సినిమాలో ఓ గిరిజన యువతి పాత్రలో నటిస్తోంది. పుష్ప సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ మూవీని నిర్మిస్తుంది.

సంబంధిత సమాచారం :