“వరుడు కావలెను” సినిమా వాయిదా పడబోతుందా?

Published on Oct 8, 2021 2:11 am IST


యంగ్ హీరో నాగ శౌర్య, రీతూ వర్మ జంటగా లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం “వరుడు కావలెను”. ఈ చిత్రంలో మురళీ శర్మ, నదియా, వెన్నెల కిషోర్, ప్రవీణ్, హర్ష వర్ధన్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 15న రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే విడుదలైన సినిమా టీజర్, పాటలు ఆకట్టుకున్నాయి.

అయితే తాజాగా ఈ సినిమా దసరా రేసు నుంచి తప్పుకుందని ప్రచారం జరుగుతుంది. అక్టోబర్ 14న మహాసముద్రం సినిమా, అక్టోబర్ 15న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, పెళ్లిసందడ్ సినిమాలు రానున్నాయి. దీంతో వరుడు కావలెను సినిమా నవంబర్ మొదటివారంలోకి షిఫ్ట్ అయ్యిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. చూడాలి మరీ ఇందులో ఎంతవరకు నిజముందనేది.

సంబంధిత సమాచారం :