మాస్ ను అలరిస్తున్న “వరుడు కావలెను” లేటెస్ట్ మాస్ బీట్.!

Published on Aug 4, 2021 12:06 pm IST

ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నాగశౌర్య హీరోగా టాలెంటెడ్ యంగ్ బ్యూటీ రీతూ వర్మ హీరోయిన్ గా నటిస్తున్న తాజా చిత్రం “వరుడు కావలెను”. లక్ష్మీ సౌజన్య డెబ్యూట్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రం నుంచి లేటెస్ట్ గా స్టార్ సంగీత దర్శకుడు థమన్ సంగీతం ఇచ్చిన ఫోక్ బీట్ “దిగు దిగు దిగు నాగ” సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేసారు.

మొన్న అనౌన్సమెంట్ అండ్ ప్రీమియర్ తోనే మంచి బజ్ ని సొంతం చేసుకున్న ఈ సాంగ్ ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్ గా కూడా సక్సెస్ అయ్యిందని చెప్పాలి. ముఖ్యంగా థమన్ బీట్స్, అలాగే అనంత్ శ్రీరామ్ మార్పులు చేసిన లిరిక్స్ కొత్తగా ఉండడంతో ఈ సాంగ్ ని మరింత ఆసక్తిగా మార్చాయి. మరో ప్రధాన ఆకర్షణ ఈ సాంగ్ లో రీతూ వర్మ గ్లామర్ షో అని చెప్పాలి.

అలాగే ఈ సాంగ్ కి ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ వీజే వర్క్ చేస్తున్నట్టుగా ఈ లిరికల్ వీడియో చూస్తే అర్ధం అవుతుంది. ఓవరాల్ గా మాత్రం థమన్ నుంచి చార్ట్ బస్టర్స్ లెక్క కంటిన్యూ అవుతుంది అని చెప్పాలి. ఇక ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం అందిస్తుండగా ఈ చిత్రాన్ని థియేట్రికల్ రిలీజ్ కే సిద్ధం చేస్తున్నారు.

లిరికల్ సాంగ్ కోసం ఇక్కడ చెయ్యండి

సంబంధిత సమాచారం :