సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న “వరుడు కావలెను” చిత్రం

Published on Oct 21, 2021 12:50 pm IST


నాగ శౌర్య హీరోగా, రీతూ వర్మ హీరోయిన్ గా లక్ష్మీ సౌజన్య దర్శకత్వం లో తెరకెక్కుతున్న రొమాంటిక్ కామెడీ చిత్రం వరుడు కావలెను. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని సూర్య దేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ను అక్టోబర్ 29 వ తేదీన విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఈ చిత్రం నవంబర్ లో విడుదల కావాల్సి ఉండగా, కొన్ని కారణాల వలన ముందుగానే ప్రేక్షకులని అలరించడానికి వస్తుంది.

ఈ చిత్రం కి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ యూ/ఏ ఇచ్చినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఒక పోస్టర్ ను సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్ర ప్రమోషన్స్ ను షురూ చేయడం జరిగింది. ఈ చిత్రం కి సంబంధించిన ట్రైలర్ ను నేడు రానా దగ్గుపాటి సాయంత్రం 7 గంటలకు విడుదల చేయనున్నారు. నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :