వరుడు కావలెను చిత్రం కి సరికొత్త రిలీజ్ డేట్!

Published on Oct 8, 2021 9:00 pm IST


నాగ శౌర్య, రీతూ వర్మ హీరో హీరోయిన్ లుగా లక్ష్మీ సౌజన్య దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం వరుడు కావలెను. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం ప్రేక్షకులు అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, విడియోలు, పాటలు సినిమా పై ఆసక్తిని పెంచేశాయి.

తాజాగా ఈ చిత్రం కి సంబంధించిన విడుదల తేదీ పై ఒక క్లారిటీ వచ్చింది. ఈ చిత్రం దసరా పండుగ కానుక గా అక్టోబర్ 15 వ తేదీన విడుదల కావాల్సి ఉంది. అయితే ఇప్పుడు ఈ చిత్రం సరికొత్త రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం ను నవంబర్ 4 వ తేదీన విడుదల చేయనున్నారు మేకర్స్. ఈ చిత్రానికి పచ్చి పులుసు వంశీ, విష్ణు శర్మ లు సినిమాటోగ్రాఫర్ లుగా వ్యవహరిస్తున్నారు. నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తుండగా, ఈ చిత్రానికి సంగీతం విశాల్ చంద్ర శేఖర్ అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :