వరుడు కావలెను చిత్రం నుండి వరుస ప్రోమోలు విడుదల!

Published on Oct 31, 2021 6:04 pm IST

నాగ శౌర్య, రీతూ వర్మ లు జంటగా లక్ష్మీ సౌజన్య దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం వరుడు కావలెను. ఈ చిత్రం తాజాగా విడుదల అయి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ నిర్మించడం జరిగింది. ఈ చిత్రం కి సంబంధించిన పాటల ప్రోమో లను చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది.

థమన్ మ్యూజిక్ అందించిన దిగు దిగు దిగు నాగ బ్లాక్ బస్టర్ ప్రోమో ను చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది. ఈ పాటకు అనంత శ్రీరామ్ లిరిక్స్ రాయగా, శ్రేయా ఘోషల్ పాడటం జరిగింది. అదే విధంగా మరొక ప్రోమో మనసులోనే నిలిచిపోకే ను విడుదల చేయడం జరిగింది. విశాల్ చంద్ర శేఖర్ మ్యూజిక్ అందించగా, సిరి వెన్నెల సీతారామ శాస్త్రి లిరిక్స్ రాశారు. చిన్మయ్ శ్రీపాద పాడటం జరిగింది. మురళి శర్మ, వెన్నెల కిషోర్, ప్రవీణ్, హర్ష వర్ధన్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :

More