రానా చేతుల మీదుగా రిలీజ్ అయిన “వరుడు కావలెను” ట్రైలర్..!

Published on Oct 21, 2021 9:07 pm IST

యంగ్ హీరో నాగ శౌర్య, రీతూ వర్మ జంటగా లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం “వరుడు కావలెను”. ఈ చిత్రంలో మురళీ శర్మ, నదియా, వెన్నెల కిషోర్, ప్రవీణ్, హర్ష వర్ధన్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 29న రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే విడుదలైన సినిమా టీజర్, పాటలు ఆకట్టుకున్నాయి.

అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్‌ను రానా దగ్గుపాటి చేతుల మీదుగా విడుదల చేశారు. ట్రైలర్‌ని చూస్తుంటే అసలు పెళ్లి చూపులు అంటేనే నచ్చని అమ్మాయిని నాగ శౌర్య ఎలా ఇంప్రెస్ చేశాడు? వారిద్దరి మధ్య లవ్ ఎలా మొదలయ్యింది? లవ్ మొదలయ్యాక కొన్ని కారణాల వల్ల వారిద్దరి మధ్య ఎలాంటి మనస్పర్ధలు వచ్చాయి? అనేదే పూర్తి కథాంశంగా అనిపిస్తుంది. అయితే ట్రైలర్‌ని చూశాక సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :

More