శివ కార్తికేయన్ “వరుణ్ డాక్టర్” విడుదల తేదీ ఖరారు!

Published on Sep 22, 2021 5:00 pm IST

మెడికల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న శివ కార్తికేయన్ వరుణ్ డాక్టర్ చిత్రం తాజాగా విడుదల తేదీని ఖరారు చేసుకుంది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రం ను అక్టోబర్ 9 వ తేదీన తెలుగు మరియు తమిళ భాషల్లో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. తెలుగు లో కూడా ఈ చిత్రం విడుదల కానుండటం తో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది.

వినయ్ రాయ్, ప్రియాంక అరుల్ మోహన్, మిలింద్ సోమన్ ఈ చిత్రం లో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శివకార్తికేయన్ ప్రొడక్షన్స్ మరియు కే జే ఆర్ స్టూడియోస్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుద్ రవి చందర్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :