వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రేక్షకుల ముందుకు వస్తోన్న “వరుణ్ డాక్టర్”

Published on Nov 9, 2021 12:30 pm IST


శివ కార్తికేయన్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం లో తెరకెక్కిన యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ వరుణ్ డాక్టర్. ఈ చిత్రం అక్టోబర్ 9 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యి ఘన విజయం సాధించింది. అంతేకాక కరోనా వైరస్ సెకండ్ వేవ్ తర్వాత 100 కోట్లు సాధించిన చిత్రం గా రికార్డు సృష్టించింది. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం ఇప్పుడు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఈ చిత్రం వచ్చే ఆదివారం సాయంత్రం 6 గంటలకు జెమిని టీవీ లో ప్రసారం కానుంది. శివ కార్తికేయన్ మరియు KJR స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. ఈ చిత్రం ఇప్పుడు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా వస్తుండటం తో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More