కొత్త ఇన్నింగ్స్ మొదలుపెడుతున్న ‘వరుణ్ సందేశ్’ !

mister-420
‘హ్యాపీడేస్’ చిత్రంతో హీరోగా పరిచయమై ‘కొత్త బంగారు లోకంతో’ ప్రేక్షకులకు మరింత దగ్గరైన యువ హీరో ‘వరున్ సందేశ్’ గత కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ మధ్యే సహానటి రితికా షేరు ను వివాహం చేసుకున్న ఈ హీరో ‘మిస్టర్ 420’ అనే చిత్రంతో కొత్త ఇనింగ్స్ మొదలుపెడుతున్నాడు. ఎస్ఎస్ రవికుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శాన్వి క్రియేషన్స్ బ్యానర్ పై హరికుమార్ రెడ్డి నిర్మిస్తున్నారు.

శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో వరుణ్ సందేశ్ సరసన ప్రియాంకా భరద్వాజ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రం ఆడియో ఆగష్టు 27న పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో గ్రాండ్ గా జరగనుంది. అలాగే సెప్టెంబర్ 9న థియేటర్లలోకి రానుంది. మరి వివాహం తరువాత వరుణ్ సందేశ్ చేస్తున్న ఈ మొదటి చిత్రం అతని కెరీర్ కు ఎలాంటి ఊపునిస్తుందో చూడాలి.